కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా శాంతిపురంలో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటన సంధర్బంగా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా బైఠాయించారు. వందలాది మందిగా వచ్చిన అభిమానులు ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలని..కీలక పదవి అప్పగించాలని నినాదాలు చేశారు. అంతే కాకుండా కుప్పం కు ఎన్టీఆర్ ను తీసుకురావాలని నినాదాలు చేశారు. దాంతో చంద్రబాబు మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతే కాకుండా చంద్రబాబు పర్యటన సంధర్బంగా కుప్పంలో భారీగా ఎన్టీఆర్ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో పార్టీలో ఎన్టీఆర్ కు ప్రాముఖ్యత పెంచాలనే డిమాండ్ ను కార్యకర్తలు ముందుకు తీసుకువస్తున్నారు. మరి దీనిపై అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అభిమానులు..కార్యకర్తల కోరిక మేరకు ఎన్టీఆర్ ను బరిలోకి దించుతారా? లేదంటే కుమారుడు లోకేష్ ను బరిలోకి దింపుతారా అన్నది చూడాలి.