నిర్మాతలను ముంచుతున్న ప్రముఖ ఓటిటీలు

నిర్మాతలను ముంచుతున్న ప్రముఖ ఓటిటీలు

మూవీ థియేటర్స్ కు పోటీగా ఓటిటీ లు పుట్టుకు వచ్చాయి. మొదట అవి చిన్న సినిమా నిర్మాతలకు వరంగా కనిపించాయి. పెద్ద సినిమాల వలన చిన్న సినిమాలకు థియేటర్ లు దొరకని పరిస్థితి ఉన్న సమయంలో ఓటిటీ లను బేస్ చేసుకుని చిన్న సినిమాలను విడుదల చేసేవారు. ఇప్పుడు అవే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ చిన్న సినిమా నిర్మాతలకు శాపం గా మారాయి. కరోనా సమయంలో థియేటర్స్ మూత పడటంతో ఆ సమయంలో రిలీజ్ కు సిద్దంగా ఉన్నచిన్న సినిమాలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాయి. అయితే చిన్న సినిమా వలన ఎటువంటి ఉపయోగం లేదని గ్రహించి, ఇప్పుడు వాటిని తమ దరిదాపుకు కూడా రానివ్వడంలేదు. ఒక వేల చిన్న సినిమాలు రిలీజ్ అయిన నిర్మాతలకు చెల్లించాలిసిన డబ్బును మాత్రం మూడు వాయిదాల్లో చెలిస్తుంది.

అదికూడా వాళ్ళకు నచ్చినప్పుడు. ఓటీటీ స‌బ్ స్క్రైబ‌ర్లు సినిమాను ప్రీ గానే చూస్తున్న నిర్మాతలకు మాత్రం డబ్బు ను పే ఫర్ వ్యూ పద్ధతిలో చెలిస్తున్నారు. ఈ పద్ధతితో చిన్న సినిమా నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. ఓటిటీ లకు సినిమా అమ్మేసి ఇప్పుడు సరైన టైమ్ కు డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న థియేటర్లలో సినిమా విడుదల చేసిన ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు కావున చిన్న సినిమా నిర్మాత వీటి మధ్య పడి నలిగిపోతున్నాడు. ఇదే ఎఫెక్ట్ పెద్ద సినిమాకు కూడా పాకింది. ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయాన్ని దక్కించుకోకపోవడంతో. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు ముందుగానే సినిమా చూసిన తర్వాతనే కొంటామ్ అంటున్నారు. పెద్ద సినిమా నిర్మాతలకు డబ్బును మూడు వాయిదాల్లోనే డబ్బును చెల్లిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటిటీ లు ఇలా కండిషన్స్ పెట్టడంతో చిన్న పెద్ద నిర్మాతలకు సవాల్ గా మారింది.

follow us