అభిమాని కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్

  • Written By: Last Updated:
అభిమాని కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్

సోనూ సూద్ గురించి చెప్పాలంటే లాక్‌డౌన్‌కు ముందు.. ఆ తర్వాత అని చెప్పాలేమో..? ఎందుకంటే లాక్‌డౌన్ కు ముందు ఈయన కూడా అందరిలాంటి నటుడు.. సినిమాల్లో విలన్. అంతే.. తెలుగులో పెద్దగా క్రేజ్ ఏం లేదు. సినిమాలు చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే. కానీ ఇప్పుడు అలా కాదు.. సోనూసూద్ అంటే హీరో. హీరోలను మించిన రియల్ హీరో. ఆయనకు అభిమానులు కాదు ఇప్పుడు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన అనిల్ బేగంపేటలో ‘లక్ష్మి సోనూసూద్’ పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతడికి సోనూసూద్ అంటే ఎంతో అభిమానం. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఓసారి తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు రావాలని ట్విట్టర్‌ ద్వారా రియల్ హీరోకు ఆహ్వానం పంపాడు. అంతే ఇంకేముంది అభిమాని అంత ప్రేమగా పిలవడంతో షూటింగ్‌లన్నీ పక్కనపెట్టి క్రిస్మస్‌ ఈవ్‌నింగ్‌లో సదరు అభిమానికి సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సోనూ.. అనిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను సందర్శించి.. ఫ్రైడ్‌ రైస్‌ టేస్ట్‌ చేశాడు. కాగా, సోనూసూద్‌ లాంటి స్టార్‌ హీరో తన చిన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ ఆ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

follow us