సోసూసూద్ హీరోగా పాన్ ఇండియా మూవీ..!

గతేడాది లాక్ డౌన్ వేల సేవా కార్యక్రామాలు మొదలు పెట్టిన సోనూసూద్ వాటిని కొనసాగిస్తు ఉన్నారు. ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అంటూ సోనూసూద్ సహాయం చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ లో ఎంతో మంది వలస కూలీలను సోనూసూద్ తన సొంత డబ్బుతో వారి స్వగ్రామాలకు తరలించారు. ఇక సెకండ్ వేవ్ లో అయితే సోనూ ఓ శక్తిలా పనిచేస్తున్నారు.తన టీంతో కలిసి 24గంటలూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఆక్సీజన్ కావాలంటూ…రెమిడిసివిర్ ఔషదం కావాలంటూ వచ్చే రిక్వెస్ట్ లకు స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.
ఇక అలాంటి సోనూసూద్ ను జనాలు విలన్ గా చూసేందుకు ఇష్టపడటం లేదు. సోనూ హీరోగా నటించాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. దాంతో నిర్మాతలు, దర్శకులు కూడా సోనూ సూద్ తో సినిమాలు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంతో టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ కూడా సోనూసూద్ కోసం ఓ కథను రాసుకున్నారట. అంతే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారట. దాంతో సినిమాల్లో ఇప్పటివరకూ విలన్ పాత్రలు వేసిన సోనూసూద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక సోనూ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.