రియల్ హీరో మరో మంచిపని..ఏపీ చిన్నారికి గుండె ఆపరేషన్..!

  • Written By: Last Updated:
రియల్ హీరో మరో మంచిపని..ఏపీ చిన్నారికి గుండె ఆపరేషన్..!

లాక్ డౌన్ వేళ ఎందరో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూసూద్ తమ సేవ కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా సోనూసూద్ ఏపీలో ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి పసి ప్రాణాన్ని కాపాడారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన వెంకట్రావు, దేవీ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి 8నెలల కుమారుడు గుండె జబ్బుతో బాధపఫుతున్నాడు.

అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలుడి పరిస్థితిని సూనుసూద్ ట్రస్ట్ కు తెలిపి సాయం చేయాలని కోరారు. అనంతరం చిన్నారి కుటుంబసభ్యులు ముంబై వెళ్లి సోనూసూద్ ను కలిశారు. అనంతరం సోనూసూద్ ముంబై లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చిన్నారికి శాస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం క్షేమంగా ఉంది. సోనూ సూద్ చేస్తున్న సేవాకార్యక్రమాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రజల కోసం సొంత డబ్బుతో సోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఎందుకు సహకరించడం లేదని అనుమానాలు తలెత్తుతున్నాయి. సోనూ ముంబై లో తన బిల్డింగ్ అక్రమంగా నిర్మించాడని బిఎమ్ఎస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోనూ కోర్టుకు వెళ్లగా అది బిఎంఎస్ ఇష్టమని కోర్టు తేల్చిచెప్పింది.

follow us