నటుల్లో మహేష్.. నటిమణుల్లో కీర్తి నెం.1

South India 2020 most tweeted Actors, Actress list
South India 2020 most tweeted Actors, Actress list

తాజాగా దక్షిణాదిలో మోస్ట్ ట్వీటెడ్ నటీనటుల జాబితాను ట్విట్టర్ విడుదల చేసింది. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచారు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తరవాత వరుసగా విజయ్, తారక్, సూర్య,అల్లు అర్జున్, రాంచరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి ఉన్నారు.

హీరోయిన్ ల జాబితాలో మహానటి కీర్తి సురేష్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరవాత వరుసగా కాజల్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆ తరవాత వరుసగా సమంత, రష్మీక, పూజ హెగ్డే, తాప్సి, తమన్నా, రకుల్ ప్రీత్, శృతిహాసన్, త్రిష లు ఉన్నారు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ మరో వైపు యాడ్స్ తో బిజీగా ఉంటారు. సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

మహేష్ సినిమా వచ్చిందటే ఆయన అభిమానులు వరుస పోస్టులతో హల్చల్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

ఇక మహానటి కీర్తి సురేష్ విషయానికొస్తే..మహానటి సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో నటనతో అదరగొట్టిన కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా ఆడకపోవడంతో మళ్ళీ కమర్షియల్ సినిమాలవైపే మొగ్గు చూపుతోంది.