పవన్ రానా సినిమాలో వారి మధ్య స్పెషల్ ఫ్లాష్ బ్యాక్.. ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానా హీరోలుగా ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని దర్శకుడు ప్లాన్ చేశారట.
ఫ్లాష్ బ్యాక్ లో సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తున్న నిత్యామీనన్ మరియు పవన్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఉండబోతున్నాట. అంతే కాకుండా ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలవబోతుందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో పవన్ భార్యగా నటించేందుకు సాయి పల్లవిని సంప్రదించారు. కానీ ప్రస్తుతం బీజీ షెడ్యూల్ ఉండటం వల్ల సాయి పల్లవి ఈ సినిమాకు నో చెప్పిందట. దాంతో మేకర్స్ నిత్యామీనన్ ను సెట్ చేశారు. ఇక సినిమాలో రానా సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.