మూవీ టికెట్స్ అమ్ముతున్న ధమాకా హీరోయిన్

మూవీ టికెట్స్ అమ్ముతున్న ధమాకా హీరోయిన్

పెళ్లి సందD మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..తాజాగా ధమాకా మూవీ తో ఈ నెల 23 న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా..గురువారం విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీ గా ఉన్నారు.

ఈ తరుణంలో హీరోయిన్ శ్రీలీల సినిమా టికెట్స్ అమ్ముతూ సందడి చేసింది. మాల్ లోని బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ లో కూర్చుని అడిగిన వారికి ధమాకా టికెట్లు ఇచ్చింది. అంతేకాకుండా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా ఫోటోలకు స్టిల్ కూడా ఇచ్చి వారిని సంతోష పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 8కి పైగా సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలతో బిజీ గా ఉండి కూడా ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం.
అలాగే ఓ వైపు సినిమాలు , ప్రమోషన్స్ చేస్తూనే..మరోవైపు మెడిసిన్ విద్యను కొనసాగిస్తోంది. మరి ఇంత బిజీ బ్యూటీకి ధమాకా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

follow us