శ్రీలీల..శ్రీలీల అంటున్న టాలీవుడ్

ధమాకా తో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న శ్రీలీల..శ్రీలీల అంటున్నారు. రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ కు ఫిదా అవుతున్నారు. మొన్నటి వరకు హీరోయిన్లలో డాన్స్ చేయాలంటే సాయి పల్లవి అనే వారు కానీ ఇప్పుడు ధమాకా లో శ్రీలీల డాన్స్ చూసి సాయి పల్లవి ..శ్రీలీల ముందు ఎందుకు పనికిరాదని కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు జోడీగా నటించింది. స్క్రీన్ ప్రజెన్స్, డ్యాన్స్ గ్రేస్‌తో ఆకట్టుకున్న భామ.. మొదటి సినిమాలోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని రవితేజ సరసన ధమాకా లో నటించింది. ఇక ఈ మూవీ చూసిన వారంతా ధమాకా సక్సెస్‌లో శ్రీలీలకు చాల క్రెడిట్ ఇస్తున్నారు. తన పెర్షామెన్స్‌తో అంతలా ఆకట్టుకుంది. పైగా ప్రస్తుత హీరోయిన్స్‌లా ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టకుండా చాలా యాక్టివ్‌గా పాల్గొని తన బాధ్యత నిర్వర్తించింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు శ్రీలీల వైపు చూస్తున్నారు.