మాస్ రాజా ఫ్యాన్స్ ను ఫిదా చేసిన శ్రీలీల

రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో శ్రీలీల మాట్లాడుతూ..మాస్ రాజా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
రవితేజ గారికి నేను పెద్ద అభిమానిని అని చాలా అంకిత భావంతో పని చేసే హీరో ఆయన అని వెల్లడించింది. అంతే కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ లో రవితేజకు గాయమైన విషయాన్ని కూడా బయటపెట్టింది. గాయం కారణంగా ఆయనకు కాలికి 12 కుట్లు పడ్డాయని ఆ గాయాన్ని లెక్క చేయకుండా రవితేజ ‘దండకడియాల్’ సాంగ్ షూట్ లో పాల్గొన్నారని ఒక మెడికల్ స్టూడెంట్ గా ఆ గాయం ఎంతగా బాధిస్తుందో తనకు తెలుసునని అయితే పాటలో ఎక్కడా ఆ గాయం బాధని కనిపించకుండా రవితేజ నటించారని అది మీరు గుర్తుపడితే నా పేరు మార్చుకుంటానని అభిమానులతో సవాల్ చేసింది.
Related News
మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు
3 months ago
శ్రీలీల..శ్రీలీల అంటున్న టాలీవుడ్
3 months ago
మూడో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా జోరు మాములుగా లేదు
3 months ago
ధమాకా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే…
3 months ago
రికార్డు స్థాయిలో విడుదలవుతున్న ధమాకా , 18 పేజెస్
3 months ago