నిర్మాతలకు చుక్కలు చూపిస్తా అంటున్న శృతి హాసన్

నిర్మాతలకు చుక్కలు చూపిస్తా అంటున్న శృతి హాసన్

కమల్ హాసన్ తెలుగు, తమిళ్, హింది, బాషల్లో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో శృతి హాసన్ నటిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుక్కుంది. మొదట బాలీవుడ్ లోకి “లక్” అనే చిత్రంతో ప్రవేశించింది. ఆ సినిమా ఫ్లాప్ కావడం ఆ తరువాత తాను నటించిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవ్వడంతో సౌత్ సినిమా పై దృష్టి పెట్టింది. తెలుగులో సిద్దార్థ్ తో “అనగనగా ఓ ధీరుడు” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో నటించిన శృతి ఆ చిత్రం నిరాశే మిగిలించింది. కానీ శృతి నటనకు మంచి మార్క్స్ పడటంతో అవకాశాలు వచ్చాయి కానీ ఏ అవకాశం కూడా శ్రుతికి కలిసి రాలేదు.

ఆ టైంలో వరస ప్లాప్స్ తో ఉన్న పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరక్షన్లో గబ్బర్ సింగ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం విజయం సాదించడంతో, వారి ఫేట్ మారిపోయింది. అక్కడినుండి శృతి వరస విజయాలతో దూసుకెళ్లుతుంది. ఆ మధ్య రష్యా కి చెందిన వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. ఏమైందో ఏమోగాని వారిద్దరు విడిపోవడంతో చాలాకాలం వరకు సినిమాలకు దూరంగా ఉంది. మరల రీ ఎంట్రీ ఇస్తూ… పవన్ “వకీల్ సాబ్” చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అందుకు ఆమె భారీగానే పారితోసికం తీసుకున్నట్లు సమాచారం. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదని నిర్మాతలకు చెప్పినట్లుగా సమాచారం. రవి తేజ క్రాక్ సినిమాలోనూ నటిస్తుంది.

follow us