ఓటీటీలోకి స్టార్ హీరోలు ..!

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్ లు మూత పడటంతో ఓటీటీకి మంచి రోజులు వచ్చాయి. సూర్య లాంటి పెద్ద హీరోల సినిమాలు సైతం ఓటీటీకి రావడంతో క్రేజ్ పెరిగింది. లాక్ డౌన్ అనంతం పరిస్థితులు మెరుగుపడిన తరవాత మళ్లీ థియేటర్లలో సందడి కనిపించి ఓటీటీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఓటీటీ పై మెరిసేందుకు సిద్దమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో ఓ వెబ్ సిరిస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ వెబ్ సిరీస్ ను నిర్మించాలని నిర్మాత సురేష్ బాబు అనుకుంటున్నారట.
సురేష్ బాబు వెంకటేష్ కోసం కథలను కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా దర్శకుడు జయంత్ డైరెక్టర్ గా మరో వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ప్లాన్ చేసినట్టుగా కూడా సమాచారం. ఇదిలా ఉండగా నాగార్జున సొంతంగా ఓ ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్యూలో కూడా నాగార్జున తానకు నేషనల్ లెవల్ లో వెబ్ సిరీస్ లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయిని చెప్పారు. అంతే కాకుండా నాగ్ తన బ్యానర్ లో సినిమాలు చేసి ఓటీటీలో విడుదల చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.