కరోనాని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్ళు…

కరోనా ఎఫెక్ట్ వల్ల దేశ, విదేశ మార్కెట్లు అన్ని కుప్పకూలుతున్నాయి , దీనితో మోసగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజెస్ తో రెడీ అయిపోయారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి.. కొన్ని రోజుల్లో అధిక లాభాలు అంటూ ఫోన్ కాల్స్, మెసేజెస్ తో వల వేస్తున్నారు .  తక్కువ ధరకే పబ్లిక్ సెక్టార్ రంగ స్టాక్స్ అని మధ్యప్రదేశ్, గుజరాత్, మైసూర్ నుంచి కాల్స్, మెసేజెస్ ఎక్కువ గా వస్తున్నాయి. వారి వలలో చిక్కుకొని మోసపోకండని నిపుణులు చెప్తున్నారు .

స్టాక్స్ కొనుగోలు చేయడానికి నిజంగానే ఇది సరైన సమయం… కానీ అవగాహన లేకుండా వాటిజోలికి వెళ్లకండి మార్కెట్ అనలిస్ట్ సలహాలు ఇస్తున్నారు.  సెబీ రిజిస్టర్ ఉన్న కంపెనీలు, బ్రోకింగ్ కంపెనీలను మాత్రమే నమ్మండి.. అంతగా కావాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు..