జక్కన్న బాహుబలి కాస్ట్యూమ్స్‌నే ఆర్ఆర్ఆర్ కు వాడుతున్నారా..?

దర్శకధీరుడు రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండా..ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఇటీవలే అలియా లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌ర్ లో అలియాభట్ ఎరుపు రంగు జాకెట్..పచ్చ రంగు చిర కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో అనుష్క కోర్టు సన్నివేశం జరుగుతుండగా ఎరుపు రంగు జాకెట్ గ్రీన్ శారీ కట్టుకుని కనిపిస్తుంది.
అంతే కాకుండా ఓ ముఖ్యమైన సన్నివేశంలో రమ్యకృష్ణ కూడా ఎరుపు రంగు జాకెట్ పచ్చరంగు చీరను కట్టుకుంటుంది. కాగా బాహుబలిలో అనుష్క, రమ్యకృష్ణ ఫోటోలు మరియు ఆర్ఆర్ఆర్ నుండి అలియాభట్ ఫోటోలను మీమ్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. జక్కన్న బాహుబళి కాస్ట్యూమ్స్ నే ఆర్ఆర్ఆర్ కు వాడుతున్నారా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజానికి పౌరానిక నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చీరలు తప్ప ఇతర కాస్ట్యూమ్స్ కనిపించవు. అంతే కాకుండా ఆకు పచ్చ, ఎరుపు రంగులు అయితే స్క్రీన్ పై భాగా కనిపిస్తాయి. ఈనేపథ్యంలోనే అలాంటి కాస్ట్యూమ్స్ ను వాడుతున్నారేమో.