‘గాలోడి’ ని లైన్లో పెట్టిన ఇద్దరు అగ్ర దర్శకులు

‘గాలోడి’ ని లైన్లో పెట్టిన ఇద్దరు అగ్ర దర్శకులు

సుడిగాలి సుధీర్..ప్రస్తుతం ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర కు పరిచమైన సుధీర్..ఈ షో ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా , సినిమాల్లో సైడ్ క్యరెక్టర్ లలో నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా గాలోడు మూవీ తో మాస్ హీరోగా అందర్నీ కట్టిపడేసాడు.

ఈ మూవీ సూపర్ హిట్ సాధించడం, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం తో నిర్మాతలంతా సుధీర్ తో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారట. ఇప్పటికే వారు సుధీర్ కు అడ్వాన్స్ లు ఇచ్చి డేట్స్ తీసుకున్నారట. త్వరలోనే వీరు సుధీర్ తో చేయబోయే సినిమాలను ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తం మీద గాలోడు మూవీ సుధీర్ జాతకాన్ని పూర్తిగా మార్చేసింది.

follow us