ఫోన్ చేసి ఆ యాంకర్ ను బెదిరించిన సుడిగాలి సుధీర్

మెజీషియన్ గా కెరీరి ప్రారంభించిన సుడిగాలి సుధీర్ సినిమాల్లో, టివి షో లో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈటీవీలో ప్రసారం అవ్వుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి మంచి స్కిట్స్ తో అందరిని నవ్విస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు టీమ్ లీడర్ గా అక్కడ రాణిస్తున్నాడు. జబర్దస్త్ ను బేస్ చేసుకుని ఢీ జోడీ లో టీమ్ లీడర్ గా ఛాన్స్ కొట్టేసి అక్కడ తన డాన్స్, స్కిట్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
పోవే పోరా షో కి విష్ణు ప్రియ తో కలిసి యాంకర్ గా కొనసాగుతున్నాడు.
సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ త్రీ మంకిస్ వంటి చిత్రాల్లో నటించి శభాస్ అనిపించుకున్నాడు. ఢీ జోడీ లో యాంకర్ ప్రదీప్ సుధీర్ ను ఎవరికైనా ఫ్రాంక్ కాల్ చెయ్యాలని కోరగా, పోవే పోరా షో లో కొ యాంకర్ గా తనతో చేస్తున్న విష్ణు ప్రియ కు ఫోన్ చేసి ఆ షో యజమాన్యం నాకు ఫోన్ చేసి దారుణంగా అవమానించారు. నేను ఆ షో నుండి తప్పుకుంటున్నాను నువ్వు కూడా తప్పుకోవాలని లేకపోతే నాకు జరిగిన విదంగానే నీకు జరుగుతుంది అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత వారిద్దరి మద్యలో ప్రదీప్ కలుగ చేసుకుని, ఢీ నుండి సుధీర్ ను ఫ్రాంక్ కాల్ చెయ్యమంటే ఫోన్ చేశాడు అంతే తప్ప మరేది లేదు అని వివరణ ఇచ్చాడు.