సైనికుడిగా విజయ్ దేవరకొండ !

దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ రంగస్థలం చిత్రం తర్వాత అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో పుష్ప అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తూ వస్తున్న సుక్కు. పుష్ప తర్వాత తన తదుపరి సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో చెయ్యనున్నడు. అందుకు సంబందించిన అనౌన్స్ మెంట్ ను ఇటీవల విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేధిక గా తెలియజేశాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశంను అంటూతున్నాయి అలాగే సినిమా స్టోరీ పై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇండియా-పాకిస్తాన్ యుద్ద నేపథ్యంలో ఈ చిత్రం యొక్క కథ నడుస్తుందంట. విజయ్ దేవరకొండ సైనికుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఇలాంటి వార్తలు వస్తుండటంతో ప్రేక్షకులో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి.
మరి ఆ వార్తలు నిజమా కదా అనే విషయం తెలవాలంటే మన రౌడీ స్టార్ గాని సుక్కు గాని ఎవరో ఒక్కరు స్పందించాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యం కలిగిన స్టోరీ. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ కి జోడీగా నటిస్తుంది.