ఆకట్టుకుంటున్న ‘కపటధారి’ ట్రైలర్‌

  • Written By: Last Updated:
ఆకట్టుకుంటున్న ‘కపటధారి’ ట్రైలర్‌

సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్ ‌క‌ప‌ట‌ధారి. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు క‌ప‌ట‌ధారి అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన కావ‌లుధారి సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన కావ‌లుధారి చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య, సమంత విడుదల చేశారు. ఆసక్తిరేపే సంభాషణలు, సన్నివేశాలతో కపటధారి ట్రైలర్‌ ఉంది. కొంతకాలం క్రితం జరిగిన హత్యలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరుకుతాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా ఛేదిస్తాడు. ఈ కేసును సాల్వ్‌ చేసే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని కథానాయకుడు ఎలా అధిగమించాడు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని, త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని అంటున్నారు నిర్మాతలు.

https://youtu.be/GwfsCoFaZ-0

follow us