అయోధ్య తీర్పు : ఫైనల్ జడ్జిమెంట్

  • Written By: Last Updated:
అయోధ్య తీర్పు : ఫైనల్  జడ్జిమెంట్

వివాదాస్పద అయోధ్య స్థలంలో ఏ మందిరం ఉందన్నది రికార్డులు చెప్పాల్సిందేనని సుప్రీకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చివేశారన్న దానికి ఆధారాలు లేవని చెప్పింది. దానిని రికార్డులే తేల్చాలంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య రామ మందిరంపై సుదీర్ఘ తీర్పు చెప్పింది. అయోధ్యలో రాముడు జన్మించారని హిందువుల అభిప్రాయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మత విశ్వాసాలతో తమకు సంబంధం లేదని చెప్పింది. వివాదాస్పద భూమిలో మాత్రం ఒక నిర్మాణం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం బాబర్ కాలంలోనే జరిగిందని తెలిపింది.

కూల్చినట్లు ఆధారాల్లేవు…

మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే వివాదాస్పద స్థలంలో ఒక కట్టడం ఉందని, అది మసీదా? మందిరమా? అన్నది తెలయదని చెప్పింది. వివాదాస్పద స్థలంలో మసీదు, మందిరం నిర్మాణాలు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. స్థలానికి సంబంధించి హక్కు యాజమాన్య పత్రాలు ఉన్న వాళ్లే వారే భూ హక్కు దారులు అని చెప్పింది. అక్కడ నమాజు చేసుకునేందుకు ముస్లింలకు హక్కు ఉందని తెలిపింది. పురావస్తు శాఖ పరిశోధనలో అక్కడ మసీదు, ఈద్గా నిర్మాణాలు ఉన్నట్లు తేలలేదన్నారు. 1885కు ముందు నుంచే అక్కడ హిందువులు పూజలు చేసుకునేవారని తెలిపింది. రామ్ చబ్రుతా, సీతారసోయ్ దగ్గర పూజలు జరిగేవని తెలిపింది. వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాలకు సంబంధించి సరైన పత్రాలు ఉన్న వారికే అన్ని హక్కులుంటాయన్నారు.

అయోధ్య ట్రస్ట్ కే అప్పగించాలి…

కట్టడం కింద మరో మతం నిర్మాణాలకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదని చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డు సరైన పత్రాలను చూపించలేకపోయిందని, వాదనలను సమర్థంగా విన్పించలేక పోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని సూచించింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తి లేదని విస్పష్టంగా తెలిపింది. బాబ్రీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలో సరైన చోట ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని చెప్పింది. మూడు నెలల్లోనే అయోధ్య ట్రస్ట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలి. మొత్తం మీద అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ్ జన్మ న్యాస్ కే అప్పగించారు. అయోధ్యలోని ఏదో ఒక ప్రాంతంలో ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని కోరింది. అయోధ్య యాక్ట్ కింద మూడునెలల్లో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.

follow us

Web Stories