యావత్ భారతదేశం ఎదురు చేస్తున్న అయోధ్య తీర్పు రేపే..!

  • Written By: Last Updated:
యావత్ భారతదేశం ఎదురు చేస్తున్న అయోధ్య తీర్పు రేపే..!

అయోధ్యపై తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పును ఇవ్వనున్నారు. కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది . ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం తో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.

follow us

Web Stories