ఆలీ షోలో రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సురేఖ వాణి..!

  • Written By: Last Updated:
ఆలీ షోలో  రెండో  పెళ్లిపై ఓపెన్ అయిన సురేఖ వాణి..!

టాలీవుడ్ లేడీ క్యారెక్టర్ ఆరిస్టుల్లో సురేఖవాణి కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సినిమాల్లో సురేఖ అక్కగా…వదిన గా నటించి అలరించింది.ముఖ్యంగా బ్రహ్మానందం కు భార్యగా నటించి సీరియస్ పాత్రలే కాకుండా కామెడీని సైతం పండించింది. అలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడు సురేఖ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంది. ఇక హీరోయిన్ లను బీట్ చేసే ఫిట్ నెస్ ఆమె సొంతం కావడంతో సురేఖ ఫాలోవర్లు కూడా ఎక్కువే. ఇక కొంత కాలం నుండి సురేఖ వాణి పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయు.

అయితే ఇప్పటికే ఆ వార్తలపై సురేఖ కూతురు సుప్రీత ఘాటుగా స్పందించగా తాజాగా సురేఖ వాని సైతం స్పందించింది. మీ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి మీరేమంటారు అంటూ అలీ ప్రశ్నించగా సురేఖా మాట్లాడుతూ..అబ్బాయి ఎవరో కూడా వెబ్ సైట్ వాళ్ళే చెప్పాలని సమాధానం ఇచ్చింది. ఇక ఎలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఫుల్ గా డబ్బులు ఉన్నోడ్ని చేసుకోవాలనుకుంటున్నా అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా మనసు ఉన్నవాళ్ళు ఎందుకంది డబ్బుంటే సరిపొద్దని చెప్పింది.

follow us

Related News