ఏజెంట్ కు మెరుగుల‌ద్దుతున్న సురేంద‌ర్ ..!

  • Written By: Last Updated:
ఏజెంట్ కు మెరుగుల‌ద్దుతున్న సురేంద‌ర్ ..!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ అనే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొద‌లెట్టేలోపే క‌రోనా సెకండ వేవ్ మొద‌లైంది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. అయితే సినిమాకు సంబంధించి అఖిల్ లుక్ ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ సినిమా కోసం అఖిల్ నెవ‌ర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడ‌ని అర్థం అయింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం క‌రోనా తో షూటింగ్ కు బ్రేక్ రావ‌డంతో సురేంద‌ర్ రెడ్డి క‌థ‌కు మెరుగులు దిద్దుతున్నార‌ట‌. నాగార్జున మ‌రియు ర‌చ‌యిత‌ల స‌ల‌హాల మేర‌కు సురేంద‌ర్ రెడ్డి మార్పులు చేస్తున్నారట‌. దానికి సంభందించి ఆన్లైన్ ద్వారా స‌రేంద‌ర్ రెడ్డి మ‌రియు టీంతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయట‌. ఇక వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌తం అవుతున్న అఖిల్ కు సురేంద‌ర్ రెడ్డి అయినా హిట్ ఇస్తారో చూడాలి.

follow us