సురేష్ బాబు యూట్యూబ్ ఛానల్ పెట్టి చేతులు కాల్చుకున్నారట.?

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 న రానా “సౌత్ బే” పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దీని ద్వారా కిడ్స్ కోసం కార్టూన్ వీడియోలు, ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోలతో కంటెంట్ ను రూపొందిస్తున్నారు.
ఈ డిజిటల్ మీడియా కోసం కొన్ని ప్రమోషనల్ వీడియోలను సైతం చిత్రించారు. దీని కోసం యూట్యూబ్ స్టార్ లతో ప్రమోషన్ లు చేయించారు. కాగా ఈ యూట్యూబ్ ఛానల్ తో నష్టాలు తప్ప లాభాలు ఉండవని రానా తండ్రి సురేష్ బాబు తొందరగానే గ్రహించారట.
ఈ డిజిటల్ మీడియా బిసినెస్ కోసం సురేష్ బాబు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రస్తుతం జోష్ మీద ఉన్న ఓటీటీ వైపు వెళ్లకుండా రానా టీమ్ చెప్పిన మాటలు విని సురేష్ బాబు యూట్యూబ్ పై ఇన్వెస్ట్ చేశారట. అయితే దీని వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవని గ్రహించిన ఆయన దీని నుండి భయట పడే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు రానా కూడా ఈ డిజిటల్ మీడియాను ఓ ఇంటర్ నేషనల్ కంపెనీకి అమ్మేసే ప్లాన్ లో ఉన్నారట.