ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తిన నిర్మాత సురేష్ బాబు

ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తిన నిర్మాత సురేష్ బాబు

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తాడు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డెక్కితే చాలు రోజుల సగం టైం రోడ్ పైనే గడిచిపోతుంది. పొరపాటున వర్షం పడిందో..ఆ టైం లో రోడ్ ఫై ఉన్నారో ఇక అంతే సంగతి. అందుకే నగరవాసులు రోడ్ ఎక్కాలంటే భయపడతారో. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్లా కష్టాలు చెప్పాల్సిన పనిలేదు. నిత్యం వందలాది వాహనాలకు దారి ఇస్తూ తెగ కష్టపడతారు. అలాంటి కష్టాన్ని అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈరోజు చూసారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సురేష్ బాబు ఈరోజు జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారారు. జూబ్లీహిల్స్‭లోని ఫిల్మ్ నగర్ వద్ద మంగళవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఉండిపోయిన సురేశ్ బాబు..ఇంతకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడం తో తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్‭ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ కాసేపు ట్రాఫిక్‭ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అక్కడున్న కొందరు సురేష్ బాబు చేస్తున్న పనిని వీడియో తీసి నెట్టింట పోస్టు చేయగా వైరల్ అవుతోంది. పెద్ద నిర్మాత అయ్యుండి.. తనకేంటి అని అనుకోకుండా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించడం వాహనదారులను ఆకట్టుకుంది.

మూవీమొఘల్‌గా పేరుగాంచిన డి.రామానాయుడు కుమారుడు సురేష్ బాబు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో విద్య పూర్తిచేశారు. ఆయన చెన్నైలోని లయోలా కళాశాలలో పీయూసీ పూర్తిచేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. 1982లో దేవత చిత్రంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగుపెట్టిన సురేష్ బాబు.. బొబ్బిలి రాజా సినిమాతోనే ఆయన పేరును నిర్మాతగా వేసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి , ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ అందుకున్నారు. 2011-12 సంవత్సరానికి గాను ఎ పి ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు.

గత కొన్ని దశాబ్దాలుగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సురేష్ బాబు ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. సురేష్ బాబు ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయి నిర్మాతగా ఏ సినిమాలను నిర్మించలేదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యం అయ్యి సినిమాలను నిర్మిస్తున్నారు.

follow us