సూర్యగ్రహణం : చేయవలసినవి (2019)

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం.. రింగ్ అఫ్ ఫైర్ తెలుగు రాష్ట్రాలలో కనిపించబోతుంది..
మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో సంభవిస్తున్న కేతుగ్రస్త కంకణాకార గ్రహణం
ఈ ఏడాది కనిపించే చివరి గ్రహణం.. ఈ గ్రహణం వాళ్ళ నాలుగు రాశుల వాళ్ళ పైన తీవ్ర ప్రభావం ఉంటుంది… ఈ గ్రహణ కాంతులు మన మీద పడకుండా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది..
సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11.. మూడు గంటలు కనిపించే ఈ గ్రహణం భారత దేశం తో పటు ఆస్ట్రేలియా లో కూడా కనిపించ బోతుంది.. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ ఆలయాలు అన్ని బుధవారం అర్ధ రాత్రి మూసేసారు మళ్ళీ గురువారం మధ్యాహ్నం గ్రహణ శాంతులు (ఆలయ సంప్రోక్షణ ) చేసి కానీ తెరవరు..
ఈ గ్రహణం తధ్యం చేయవలసిన పనులు ఇలా చెప్తున్నారు జ్యోతిష్యులు.. ముఖ్యం గా మూలా నక్షత్రం లో పుట్టిన వారు జాగ్రత్త గా ఉండాలి.. ఏ నక్షత్రం లో సంభవిస్తుందో ఆ నక్షత్రం లో జన్మించిన వాళ్ళు గ్రహణం విడిచిన వెంటనే బ్రాహ్మణులకి దానం చెయ్యాలని, అది కూడా సంకల్పం చెప్పి ఇవ్వాలని చెప్తారు..
గ్రహణం అయినా వెంటనే తల స్థానం చేసి దేవుడికి నమస్కరించి.. చేయవలిసిన శాంతులు మొదలు పెట్టండి..
దాన సమయంలో చెప్పాల్సి సంకల్పం
ధనుస్సు రాశి: మమ జన్మజాతక ధనుః రాశ్యాత్ తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
వృషభ రాశి: మమ జన్మజాతక వృషభ రాశ్యాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
కన్య రాశి: మమ జన్మజాతక కన్యా రాశ్యాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
మకర రాశి: మమ జన్మజాతక మకర రాశ్యాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
ఆజ్య పూరిత కాంశ్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష సువర్న జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
ఇలా ధానులు చేయలేని వాళ్ళు శివ కవచ స్తోత్రం పాటిస్తే మంచిది..