నందమూరి తారక రామారావు 50సంవత్సరాలకు పైగా తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా రాణించారు. 1949లో ఎన్టీఆర్ “మనదేశం” సినిమాతో సినిమాల్లోకి రంగప్రవేశం చేసారు. హిందీలో నయా ఆద్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో దాదాపు 400పైగా చిత్రాల్లో నటించి తెలుగోడి సత్తాను చూపించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్నో చిత్రాలను నిర్మించి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేసారు. పౌరాణిక,జానపద , సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి “విశ్వ విఖ్యాత […]