ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ‘డర్టీ హరి’ సినిమా వాల్ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఉండవల్లి సెంటర్లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాత, దర్శకుడుపై కేసు నమోదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల […]