మంత్రి అవంతి శ్రీనివాస్ ను హీరో శర్వానంద్ కలిసారు. ఈ సందర్భంగా కాసేపు ఇద్దరూ ముచ్చటించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహాసముద్రం సినిమా షూటింగ్ సింహగిరి కొండ పై జరుగుతుంది. సినిమాలో శర్వానంద్, హీరోయిన్ అదితీరావు హైదరి పై కీలక సన్నివేశాలను ఆలయప్రాంగణంలో చిత్రీకరిస్తున్నారు. అయితే సోమవారం మంత్రి అవంతి శ్రీనివాస్ సింహగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా షూటింగ్ లో ఉన్న చిత్రం యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. […]