స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ 28న కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. బన్నీకి కరోనా రావడంతో ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ గుడుల్లో ప్రార్థనలు కూడా చేశారు. అయితే బన్నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. […]