టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వేదం సినిమాలో సిరిసిల్ల రాములు గా నటించిన నాగయ్య ఈరోజు ఉదయం 4:30 నిమిషాలకు మరణించారు. నాగయ్య క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో నటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నాగయ్య నటించారు. ఆయన నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో తన మనవడి చదువు కోసం కిడ్నీ అమ్ముకున్న సన్నివేశంలో నాగయ్య ఎడిపించారు. ఈ సినిమాలో నాగయ్య నటనకు గాను అవార్డులు సైతం వరించాయి. […]