మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. గతేడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని […]