పెళ్లి ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

పెళ్లి ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని , ముంబై కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేయబోతుందని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతుండడం తో అభిమానులంతా నిజమే కావొచ్చని ఆమెను అడగడం మొదలుపెట్టారు. అయితే ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో పెళ్లి ఫై ప్రశ్నించగా..ఆమె సమాధానం చెప్పకతప్పలేదు.

‘‘వాస్తవానికి సోష‌ల్ మీడియాలో కొంద‌రు నా పెళ్లిని ఎప్పుడో చేసేశారు. ఓసారి డాక్ట‌ర్ అన్నారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అని అంటున్నారు. అయితే అవ‌న్నీ నిజాలు మాత్రం కావు. నేను నిజంగా పెళ్లి చేసుకుంటే అంద‌రికీ చెప్పే చేసుకుంటాను. సాధార‌ణంగా అంద‌రి ఇళ్ల‌లో ఉండేలాగానే మా ఇంట్లోనూ నన్ను పెళ్లి చేసుకోమ‌ని ఇబ్బంది పెడుతున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. నేను రూమ‌ర్స్‌ను ప‌ట్టించుకోను. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే న్యూస్‌ను ప‌ట్టించుకోను’’ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తునని , వచ్చే నెలలో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపారు.

follow us