మిల్కీ బ్యూటీతో సామ్ జామ్

అక్కినేని సమంత ఆహా కోసం సామ్ జామ్ అనే టాక్ షో చేస్తుంది. అల్లు అరవింద్ ఈ షో పై భారీగానే ఖర్చు పెడుతున్నాడు. ఇక ఈ షో లేడి దర్శకురాలు నందిని రెడ్డి ఆద్వర్యంలో జరుగుతుంది. ఈ షో కోసం సమంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చి అలరించాడు. రెండో ఎపిసోడ్ కి రానా, నాగ్ అశ్విన్ లు వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్ కు సైనా నెహ్వాల్ ని గెస్ట్ గా పిలవడంతో ఆ షో అంతగా ఆహా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ, షో లో తెలుగు పదాల కంటే సమంత ఇంగ్లిష్ ఎక్కువగా యూస్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

తాజాగా సామ్ జామ్ షో కి మిల్కీ బ్యూటీ “తమన్నా” ను గెస్ట్ గా వచ్చింది అందుకు సంబందించిన ఫోటోస్ ను “ఆహా” టీమ్ తమ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇక తమన్నా తోనైనా ఈ షో కి మంచి గుర్తింపు వస్తుందేమో చూడాలి. ఆహా సామ్ జామ్ టాక్ షో కి హిందీలో కరణ్ జోహర్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ కు పనిచేసిన టెక్నీషియన్ టీమ్ సమంత షో కోసం పనిచేస్తున్నారు. కానీ ఆహా వీక్షకుల మనసును మాత్రం గెలుచుకోలేకపోతుంది. తమన్నా ఎపిసోడ్ ద్వారా అయిన అల్లు అరవింద్ “ఆహా” కు subscribers పెరుగుతారేమో చూడాలి. సామ్ జామ్ షో కి త్వరలోనే చిరంజీవి, అల్లు అర్జున్ లు గెస్ట్ గా రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
