ఓటీటీ వేదిక ‘ఆహా’ని గట్టిగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే ఈ సంస్థపై దాదాపుగా 80 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఈ సంస్థ కుదురుకుని, లాభాలు తెచ్చి పెట్టడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. దీనికి ఫిక్సయ్యే… రంగంలోకి దిగారంతా. `ఆహా`కి అదనపు హంగులు తెచ్చేందుకు కోర్ టీమ్ విశ్వయత్నం చేస్తోంది. అందులో భాగంగా తమన్నాని రంగంలోకి దింపుతోంది. తమన్నాతో ఓ టాక్ షో చేయబోతోంది ఆహా. ఈ టాక్ షోలో సినిమా సెలబ్రెటీలు పాలు పంచుకుంటారు. నెంబర్ వన్ యారీ, లక్ష్మీస్ టాక్ షో.. టైపు అన్నమాట. తమన్నా లాంటి స్టార్ ప్రశ్నలు అడగడం, సెలబ్రెటీలకు ఛాలెంజ్‌లు విసరడం ఆకట్టుకునే అంశమే. పైగా అల్లు అరవింద్ పిలిస్తే.. స్టార్లకు వరుస కట్టేస్తారు. సో.. షో కూడా పాపులర్ అయిపోతుంది. తద్వారా ఆహాకు మంచి మైలేజీ దక్కుతుంది. ఇందుకు గానూ… తమన్నాకు భారీ మొత్తంలో పారితోషికం కట్టబెతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఓ ఇంటర్వ్యూకి తమన్నాకు 8 నుంచి 10 లక్షల వరకూ ముట్టజెప్పబోతున్నార్ట. వారానికి ఒక ఇంటర్వ్యూ సరిపోతుంది. తమన్నా కాల్షీట్లు వారం రోజులు దొరికితే చాలు. ఏడెనిమిది ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి, వాటిని రెడీ చేసుకోవాలన్నది `ఆహా` ఆలోచన. ఈ ఇంటర్వ్యూలను ఆహాలోనే కాదు, ఓ టీవీ ఛానల్‌లోనూ ప్రదర్శిస్తార్ట. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో శ్లాట్ ని కొనుగోలు చేయాలని, తద్వారా ఆహాకి మరింత మైలేజీ కల్పించాలని భావిస్తోంది. కేవలం ఈ షో ద్వారా తమన్నాకు 2 నుంచి 3 కోట్ల వరకూ ముట్టజెప్పే ఛాన్సుంది. లాక్ డౌన్ టైమ్‌లో.. ఇది భలే సంపాదన కదా..?
Latest article
తెలుగులో ఫస్ట్ ఆంథాలజీ “పిట్టకథలు” టీజర్ విడుదల.!
డిజిటల్ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తరువాత దర్శకులు, నటీనటుల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొత్తగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ప్రయోగాలు కూడా...
గల్లీ బాయ్ ని హీరో చేసిన నాగబాబు..!
జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన నాగబాబు జి తెలుగులో అదిరింది షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. నాగబాబుకు ఉన్న క్రేజ్ తో ఈ షో కుడా తెగ పాపులర్ అయ్యింది. ముఖ్యంగా...
శింబును వెలివేసిన నిర్మాతల మండలి.!
తమిళ నటుడు శింబు నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తారు. శింబు నటించిన ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) సినిమా మూడేళ్ళుపై మూడేళ్ళుగా వివాదం నడుస్తుంది. ఆ వివాదమే ఇప్పుడు...
బాలయ్య vs చిరంజీవి ఏమౌతుందో..?
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య పరిచయం అక్కర్లేని పేర్లు. ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు తమ సినిమాలను...