విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా డేటింగ్..

విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా డేటింగ్..

మిల్కీ బ్యూటీ ప్రేమలో పడిందా..అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘డార్లింగ్స్, గల్లీ బాయ్స్’ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ తో తమన్నా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. విజయ్ వర్మ తెలుగు లో నాని హీరోగా నటించిన MCA మూవీ లో విలన్ గా నటించాడు. కానీ ఈ మూవీ ఆయనకు పెద్దగా గుర్తింపు తేలేకపోయింది. విలన్ గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం తో మరో ఛాన్స్ లేకుండా పోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం డార్లింగ్స్, గల్లీ బాయ్స్ మూవీస్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక తమన్నా విషయానికి వస్తే కెరియర్ మొదట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈమె..ప్రస్తుతం కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడి వైపు నిర్మాతలు , దర్శకులు చూడడమే మానేశారు. ఒకవేళ వచ్చిన సీనియర్ హీరోలకు జోడిగా ఛాన్సులు వస్తున్నాయి. అందుకే బాలీవుడ్ ను నమ్ముకొని గత కొద్దీ నెలలుగా అక్కడే మకాం వేసి వెబ్ సిరీస్ లు చేస్తూ కెరియర్ ను నడిపిస్తుంది. ఇదిలా ఉంటె అమ్మడు నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ..వీరిద్దరూ గోవాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ పార్టీలో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. హగ్స్, కిస్సింగ్స్‌తో గట్టిగానే ఎంజాయ్ చేసారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. విజయ్ వైట్ షర్ట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించగా.. తమన్నా హాట్ పింక్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో హాట్‌గా దర్శనమిచ్చింది.

ఈ వీడియోల‌ను ఉద్దేశించి విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా డేటింగ్‌లో ఉన్న‌ది నిజ‌మేనంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ క‌లిసి ల‌స్ట్ స్టోరీస్ -2లో జంట‌గా న‌టిస్తోన్నారు. 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన ల‌స్ట్ స్టోరీస్‌కు కొన‌సాగింపుగా ల‌స్ట్ స్టోరీస్ -2 తెర‌కెక్కుతోంది. ఈ ఆంథాల‌జీ సినిమా షూటింగ్‌లోనే విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నాకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు చెబుతున్నారు.

తెలుగు లో ప్రస్తుతం తమన్నా ‘భోలా శంకర్‌’ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు కాగా.. ఇందులో కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అంతేకాదు ‘కిట్టి’ అనే మలయాళ చిత్రంలో కూడా నటిస్తుంది.

follow us