త‌మిళ‌ న‌టుడు వివేక్ క‌న్నుమూత‌..!

tamil actor dies in chennai hospital
tamil actor dies in chennai hospital

ప్రముఖ నటుడు వివేక్ చెన్నై ఆస్పత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. వివేక్ శుక్రవారం గుండెపోటు రావడం తో స్థానిక నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే దానికి ఒకరోజు ముందు గురువారం ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక వివేక్ చికిత్స పొందుతున్న సమయం లో పరిస్థితి విషమించడం తో ఉదయం 4:35 నిమిషాలకు కన్నుమూసినట్టు డాక్టర్లు వెల్లడించారు.

వివేక్ మరణం తో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. వివేక్ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి నవ్వులు పూయించారు. వివేక్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వివేక్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం తో టాలీవుడ్ కు కూడా ఆయన సుపరిచితులయ్యారు. ముఖ్యంగా సూర్య హీరోగా నటించిన సింగం సిరీస్ లలో వివేక్ తన కామెడీ తో అలరించారు.