శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ !

శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ !

కరోనా వైరస్ ప్రభావం ఇండియా లో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సినీ రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్ 19 బారిన పడ్డారు. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఇక ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం కరోనా తో పొరాడి చివరికి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు.

తమిళ నటుడు రాధికా భర్త, శరత్ కుమార్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో… డాక్టర్స్ టెస్ట్స్ నిర్వహించగ టెస్ట్ పాజిటివ్ అని తేలింది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ విషయాన్ని ఇంస్టా గ్రామ్ వేధిక తెలియజేసింది…. అప్పా (శరత్ కుమార్) కు ఈ రోజు కరోనా టెస్ట్ లు నిర్వహించగ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందని వెంటనే హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని. అప్పా గురుంచి మరింత సమాచారం అందిస్తా అంటూ షేర్ చేసింది.

శరత్ కుమార్ భార్య రాధికా, కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కు మాత్రం కరోనా లక్షణాలు మాత్రం ఏమి లేవు. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కరోనా లక్షణాలు అంతగా లేవని. డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య విషయంపై ఆయన అభిమానులు ఆందోళన చెందలిసిన అవసరం లేదు అన్నారు.

follow us