ప్రముఖ కమెడియన్ కు గుండెపోటు పరిస్థితి విషమం..!

tamil actor vivek suffers heart attack admitted into hopital
tamil actor vivek suffers heart attack admitted into hopital

ప్రముఖ కమెడియన్ వివేక్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం తీవ్రమైన చాతి నొప్పి రావడంతో ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే వివేక్ కు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వివేక్ గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంధర్బంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా నుండి రక్షించుకోవాలంటే అదొక్కటే మార్గమని పేర్కొన్నారు.

వివేక్ ఎన్నో సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు. అంతే కాకుండా తెలుగులో డబ్ అయిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులయ్యారు. ముఖ్యంగా సింగం సినిమాలో సూర్య పక్కన కానిస్టేబుల్ గా నటించి కామెడీ పండించారు. ఇక ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వివేక్ త్వరగా కోలుకోవాలని హీరోల అభిమానులు..వివేక్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.