ఆయిదు సంవత్సరాలు ఆగలేకపోతే పాదయాత్ర చేసుకో ..

ముఖ్యమంత్రి సీట్లో కూర్చోమనండి ...

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద స్పందిస్తూ ఎన్నికల కమిసనర్ , చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిసనర్ ని ప్రజలు కొడతారని , ఆయన చాలా కోపంగా ఉన్నారని అన్నారు. మేము ఎన్నికల కమిషన్ని గౌరవిస్తాము ఎన్నికల కమిసనర్ తీసుకున్న నిర్ణయాలని కాదని , ఎన్నికల కమిసనర్ నిమ్మగడ్డ రమేష్ ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోమనండి అంటూ వ్యాక్యానించారు.

ఇంకా చంద్రబాబు లాంటి నీచ రాజకీయనాయకులు ఉన్నతవరకు వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదన్నారు. ఆయిదు సంవత్సరాలు ఆగలేకపోతే పాదయాత్ర చేసుకోమని చంద్రబాబు కి సలహా ఇచ్చారు. కరోనా వైరస్ ని ఎలా అరికట్టాలో ప్రభుత్వం  జాగ్రత్తలు తీసుకొంటుందని చెప్పారు.