17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ రాజధాని విషయమై సమావేశమైన ఏపీ అసెంబ్లీ ఇంకా కొనసాగుతోంది. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీ సీఎం జగన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు. ఏకంగా టీడీపీ సభ్యులు అంతా కలిసి స్పీకర్ పోడియం చుట్టుముట్టి జై అమరావతి, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలపై శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన సస్పెన్షన్ ప్రతిపాదించారు. దానిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో వారి మీద సస్పెన్షన్‌ వేటు వేశారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణంరాజు, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చిన్నరాజప్ప, వెంకట్రెడ్డి నాయుడు, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయస్వామిలు సస్పెన్షన్ కు గురయ్యారు.

Tags

follow us