జబర్దస్త్ బ్యూటీకి వెల్ కమ్ చెప్పిన ఖిలాడి టీమ్..!

క్రాక్ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం “ఖిలాడి” సినిమాలో నటిస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ లపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా పూర్తిచేస్తున్నారు. కేవలం 55 రోజుల్లోనే షూటింగ్ నుంపూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కాగా 45 రోజులు యాక్షన్ సన్నివేశాలనే చిత్రించబోతున్నారట. దాంతో ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది.
సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా యాక్షన్ హీరో అర్జున్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు ఈ మధ్యే వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఖిలాడి యూనిట్ అనసూయకు వెల్ కమ్ చెప్పింది. ఈ మేరకు బ్యూటీఫుల్ అనసూయ కు ఖిలాడి టీమ్ వెల్ కమ్ చెబుతోందని నిర్మాత బిఎ రాజు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఏ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా రవితేజ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ కి కూడా స్టెప్పులు వేయబోతుందని టాక్ వినిపిస్తోంది.