కనిపిస్తే కాల్చేసే స్టేజికి తెచ్చుకోవద్దు : కెసిఆర్

తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ కరోనా వైరస్ ను అంతు పెట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలు అన్ని వణికిస్తున్న ఈ కరోనా ను కంట్రోల్ చెయ్యాలి అంటే ప్రజలు హోమ్ క్వరంటాయిన్ లో ఉండక తప్పదు..

రాష్ట్రన్నీ రక్షించుకునే దిశ లో ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకి వస్తే ఇక ఏమి చేయలేము కనిపిస్తే కాల్చేయడం తప్ప.. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి.. ఆర్మీ కూడా దింపాల్సి వస్తది.  ఇంకా సిట్యుయేషన్ ని కంట్రోల్ చేయడానికి.. దయచేసి ప్రజలు పరిస్థితి ని అర్ధం చేసుకొని మెలిగాలని అన్నారు కెసిఆర్..

హోమ్ క్వరంటాయిన్ లో ఉన్న వాళ్ళ పాస్పోర్ట్ కలెక్టరేట్ లో పెట్టుకోండి.. అలానే ఇప్పటికే హాస్పిటల్ లో పాజిటివ్ తో జాయిన్ అయిన వాళ్ళు ఆరోగ్యం స్థిరంగానే ఉంది.. కోలుకుంటున్నారని సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో అన్నారు .