ఆర్జివీ కి తెలంగాణ హై కోర్టు షోకాజ్ నోటీసులు

రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకన్న ఆయనపైనే ఉండే కేస్ లే ఎక్కువని చెప్పాలి ఆర్జివీ ఏది చేసిన సంచలనమే. సోషల్ మీడియా వేదిక గా ఏది మాట్లాడినా, ఏది రాసి పోస్ట్ చేసిన సంచలనమే. సీనియర్ ఎన్‌టిఆర్ బయోపిక్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం తీసి సంచలనం సృస్టించాడు. 2014 ఎలక్షన్స్ కు ముందు “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా తీసి చంద్రబాబు అసెంబ్లి ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి ఓక్కింత కారకుడు అయ్యాడు. ఏదో విదంగా నిత్యం సోషల్ మీడియాలో ఆర్జివీ పేరు మొగుతూనే ఉంటుంది.
ఆర్జివీ నిర్మిస్తున్న “దిశ ఎంకౌంటర్” చిత్రం పై తెలంగాణ హై కోర్ట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది హైదరాబాద్ లోని షాద్ నగర్ సమీపంలో నలుగురు వ్యక్తులు కలిసి ఓ అమ్మాయి ని సామూహిక అత్యాచారం చేసి, చంపేసిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని “దిశ ఎంకౌంటర్” అనే చిత్రాన్ని ఆర్జివీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలను నిలిపి వెయ్యాలని, ఆ నలుగురు కుటుంబాలకు చెందిన వ్యక్తులు హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యడం జరిగింది. వారి తరుపు లాయర్ కృష్ణ మూర్తి.. కోర్టుకు వివరిస్తూ ఇప్పటికే ఆ నలుగురు ఎన్ కౌంటర్ తో వాళ్ళు ఊరిలో ఉండలేక పోతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వాళ్ళను అసలు ఆ ఊరిలో లేకుండా తరిమి వేసే ప్రయత్నం చేస్తున్నాడు.
దిశ ఘటనపై జ్యుడిషినల్ కమిషన్ విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించాడు. అదేవిదంగా ఈ చిత్రంలో వారిని నిందితులుగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టు కు విన్నవించాడు. పిటిషనర్ తరుపు వాదనలు విన్న హై కోర్ట్… సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు అందించింది. ఆ షోకాజు నోటీసులపై ఆర్జివీ నుండి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.