బిగ్ బాస్ స్థానంలో వదినమ్మ !

బిగ్ బాస్ స్థానంలో వదినమ్మ !

నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ 4 రియాలిటీ షో ముగింపు దశకు వచ్చేసింది. గడిచిన మూడు సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక టి‌ఆర్‌పి రేటింగ్స్ లో కూడా దూసుకుపోతుంది. బిగ్ బాస్ ను ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు ఓ చెదు వార్తా. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం అవ్వుతున్న షో టైమింగ్స్ లో స్టార్ మా మార్పులు చేసింది.

డిసెంబర్ 7 నుండి ఇది అమలు అవ్వుతుంది. స్టార్ మా లో రాత్రి 7: 00 గంటలకు ప్రసారం అవ్వుతున్న వదినమ్మ సీరియల్ ఇక నుండి రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం అవ్వుతుంది. వదినమ్మ సీరియల్ స్థానంలో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ప్రసారం అవ్వుతుంది. ఇక నుండి బిగ్ బాస్ రాత్రి 10:00 లకు ప్రసారం అవ్వుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం ఏమాత్రం మార్పు చెయ్యడం లేదు. అందుకు సంబందించిన ప్రోమోలు కూడా విడుదల చేసింది. బిగ్ బాస్ 4 చివరి దశకు చేరుకుంది. కావునా టైమింగ్స్ లో మార్పులు చేసిన పెద్దగా ఏం ప్రభావం ఉండదని స్టార్ మా భావిస్తుంది. కావున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

follow us