నటీనటులు: తాప్సి, పావిల్ గులాటి, రత్న పాథక్ షా, తన్వి అజ్మీ, రామ్ కపూర్, కుముద్ మిశ్రా తదితరులు
మ్యూజిక్: అనురాగ్ సైకియా
సినిమాటోగ్రఫీ: సౌమిక్ ముఖర్జీ
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అనుభవ సిన్హా
దర్శకత్వం: అనుభవ్ సిన్హా
టాలీవుడ్ లో పెద్దగా రాణించలేకపోతున్న తాప్సి బాలీవుడ్ లో మాత్రం దూసుకుపోతున్నది. మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఈ నటి థప్పడ్ అనే సినిమా చేసింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.
కథ:
తాప్సి, పావిల్ గులాటిలు భార్యాభర్తలు. అందమైన భార్యాభర్తలు. అన్యోన్యమైన సంసారం. అంతా బాగుంది. పావిల్ సామాన్య జీవితం. అందరిలాగానే ఇంట్లో తన మాటే నెగ్గాలి అనుకునే రకం. అలానే ఉంటారు. అయితే, పావిల్ కు ప్రమోషన్ వస్తుంది. అలా ప్రమోషన్ వచ్చినపుడు ఫారెన్ వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటారు. అదే సమయంలో అనుకోకుండా వీరు ఓ ఇంటికి శుభకార్యానికి వెళ్తారు. అక్కడ భార్య తాప్సి పై చేయి చేసుకుంటాడు భర్త పావిల్. తాప్సి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కావడంతో పావిల్ తో విభేదిస్తుంది. విడిపోవాలని అనుకుంటారు.. ఆ తరువాత ఏం జరిగింది అన్నది కథ.
విశ్లేషణ:
భార్యపై భర్త చేయి చేసుకోవడం అనే చిన్న కాన్సెప్ట్ తో సినిమాను నిర్మించారు. మాములుగా ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తే బాగుంటుంది. కానీ, దర్శకుడు ఈ చిన్న లైన్ ను తీసుకొని ఓ సినిమా చేయడం అన్నది గ్రేట్. భర్త భార్యపై చేయి చేసుకోవడం సమస్య కాదు. కానీ, అందరి ముందు భార్య చెంపపై కొట్టడం అన్నది ఇక్కడ ప్రధాన సమస్య. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా చెప్పుకోవచ్చు.
ఈ కథతో సినిమాను తీసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ లో అన్యోన్యమైన దాంపత్యం గురించి చూపించిన దర్శకుడు భార్య పై చేయి చేసుకున్నాక కథ మొత్తం మారిపోతుంది. తాప్సి తనకు భర్తతో కలిసి ఉండాలని లేదని చెప్పడం దగ్గరి నుంచి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. చెంపదెబ్బ కొడితే విడాకులు తీసుకుంటారా అనే డౌట్ రావొచ్చు. దానికి తాప్సి చెప్పిన సమాధానాలు సినిమాలో చాలా ఉన్నాయి. చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ కథను నడిచిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
తాప్సి నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఒక భర్తకు భార్యగా ఎంత అన్యోన్యంగా ఉంటుందో, తన ఆత్మగౌరవానికి భంగం కలిగినపుడు కలిగిన ఆవేదనను ఆమె హావభావాలతో పలికించింది. హీరో పావిల్ గులాటి సగటు భర్త పాత్రలో మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే, అనురాగ్ సైకియా మ్యూజిక్ బాగుంది. అలానే అనురాగ్ సిన్హా దర్శకత్వం సినిమాకు అదనపు ఆకర్షణ.
పాజిటివ్ పాయింట్స్:
కథ, కథనాలు
తాప్సి
దర్శకత్వం
నెగెటివ్ పాయింట్స్;
నిడివి
చివరిగా: థప్పడ్-ప్రతి మహిళ చూడదగ్గ చిత్రం