సమంత కు కోపం వస్తే చేసే పని అదేనట

సమంత కు కోపం వస్తే చేసే పని అదేనట

మాములుగా ఎవరికైనా కోపం వస్తే దగ్గర్లో ఉన్న వస్తువులను పడేయడం..పెద్దగా అరవడం వంటివి చేస్తుంటారు. అయితే సామ్ మాత్రం సైలెంట్ గా జిమ్ కు వెళ్లి విపరీతంగా జిమ్ చేస్తుంటుందట. తెలుగు , తమిళ్ భాషల్లో పలు సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ చేస్తుంది. ఇటీవల మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి చికిత్స తీసుకుంటుంది.

ప్రస్తుతం కోలుకుంటున్న సమంత ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తనకు కోపం వచ్చినప్పుడు జిమ్ కు వెళ్లి తనకు ఇష్టం వచ్చినట్టుగా వర్కవుట్ లు చేస్తానని దాంతో నా కోపం తగ్గిపోతుందని తెలిపింది. తాను డబ్బు పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడనని తనకు డబ్బు కన్నా నటనే ముఖ్యమంది. నటించే ప్రతి పాత్రని ఆస్వాదిస్తానని అలా నటించకపోతే ఎలాంటి సంతోషం ప్రయోజనం వుండదని తెలిపింది. ఈ విషయంలో నాకు నేనే పెద్ద విమర్శకురాలినని మన తప్పులు పొరపాట్లని మనం సరిదిద్దుకున్నప్పుడే వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్లగలమని స్పష్టం చేసింది.

follow us