వీరసింహరెడ్డి నుండి మూడో సాంగ్ రాబోతుంది

వీరసింహరెడ్డి నుండి మూడో సాంగ్ రాబోతుంది

నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వీరసింహరెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. వరుస పెట్టి సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేసి అలరిస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య , సుగుణ సాంగ్స్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచిన మేకర్స్..ఇప్పుడు మూడో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

సెకండ్ హాఫ్ లో వచ్చే మూడవ స్పెషల్ ఐటెం సాంగ్ ను డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో బాలయ్య ఊర మాస్ స్టెప్స్ తో కుమ్మేసాడని , థియేటర్స్ లలో ఈలలతో మారుమోగిపోతాయని చెపుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

follow us