కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలివే.!

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంది. వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఇక కరోనా ఉగ్రరూపంతో సినిమా పరిశ్రమకు మళ్లీ గట్టు పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా థియేటర్లను నిర్వాహకులు స్వచ్చందంగా ముసుకున్నారు. మరో వైపు యూనిట్ సబ్యులకు కరోనా రావడం కారణంగా కొన్ని షూటింగ్ లు వాయిదా వేసుకున్నారు. ఇక మరి కొన్ని సినిమా షూటింగ్ లను ముందు జాగ్రత్తగా వాయిదా వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా కూడా కొన్ని సినిమాల షూటింగ్ లు మాత్రం బ్రేకుల్లేకుండా జరుగుతున్నాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ లో జరుపుతున్నారు. అంతే కాకుండా నని హీరోగా నటిస్తున్న శ్యామ్ సుందరాయ్ సినిమా షూటింగ్ ను కూడా హైదరాబాద్ లో జరుపుతున్నారు. ఈ సినిమా కోసం వందేళ్ల క్రితం నాటి టెంపుల్ సెట్ ను ఏర్పాటు చేసారు. అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేస్తున్నారు. మరోవైపు శర్వానంద్ సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న మహాసముద్రం సినిమా షూటింగ్ ను వైజాగ్ లో శరవేగంగా పూర్తి చేస్తున్నారు.