తిప్పరా మీసం రివ్యూ : తిప్పే సీన్ పడలేదు

  • Written By: Last Updated:
తిప్పరా మీసం రివ్యూ :  తిప్పే సీన్ పడలేదు

శ్రీ విష్ణు తిప్పరా మీసం తో అలరించడానికి మన ముందుకు  వచ్చాడు ఈ వారం .. అసలు ఆ సినిమా లో యంతా వరకు మీసం తిప్పాడో చూద్దాం.. 

శ్రీ  విష్ణు చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఒక DJ..  డ్రగ్స్ అంటూ బెట్టింగులు అంటూ తిరుగుతూ ఉంటాడు.. ఆకరికి అమ్మ ని కూడా డబ్బుల కోసం కేసుల్లోకి లాగుతాడు ..  మనిశంకర్ గా  కనిపించే హీరో కన్నా తల్లినే ఫోర్జరీ కేసు పెట్టి 40 లక్షల కోసం కోర్టు మెట్లు ఎక్కిస్తాడు ఇంకా గెలుస్తాడు కూడా..  హీరోయిన్ ఏమో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది.. తెల్లగా ఉండడం తప్ప స్క్రీన్ మీద యాక్టింగ్ అసలు ఏం అయినా వచ్చా అని డౌట్ కూడా వస్తుంది ఆమె నటన చూస్తుంటే.. దర్శకుడికి ఎందుకు నిక్కీ ని పెట్టుకోవాలి అనిపించిందో అసలు అర్ధం కాదు .. 

హీరో ఒక బెట్టింగ్ లో 30 లక్షలు పోగుట్టుకుంటాడు ఇంకా వాటిని కట్టడానికి 2 నెలలా వ్యవధి ఉంటుంది కానీ 30 లక్షలు అంటే మాటలు కాదు కదా ఏం చేయలేక ఇంకో బెట్టింగ్ (కార్ రేసింగ్) కి పోతాడు అక్కడ 20 లక్షలు రానే వస్తాయి కానీ ఖాళీ అనే వాడు ఆ డబ్బులతో పారిపోతాడు..

ఈ లోపు హీరో మార్నింగ్ జాగింగ్ చేస్తూ హీరోయిన్ ని చూసి లవ్ చేస్తాడు ..ఇంకా హీరోయిన్ అయితే మన హీరో కోసమే వెయిట్ చేస్తున్నట్టు చెప్పగానే ఓకే చెప్పేస్తుంది.. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న మన హీరో ఒకానొక సందర్భం లో హీరోయిన్ మీద బలాత్కారం చేయడానికి చూస్తాడు కూడా.. 

30లక్షలు కట్టడానికి హీరో కి వేరే దారి లేక కన్నా తల్లి మీదే 40 లక్షలు ఫోర్జరీ కేసు వేస్తాడు.. ఈ కేసులో ఎవరు గెలుస్తారు అన్నదే కధ , ఈ లోపు ఖాళీ మర్డర్ కేసు వచ్చి మన హీరో మీద పడుతుంది.. దానికి పోలీస్ ఆఫీసర్ గా మన హీరోయిన్ ఆ కేసు చూసుకుంటుంది , అయినా హీరో ని కాపాడలేక పొగ 7 సంవత్సరాలు జైలు శిక్ష కోసం పడుతుంది.. 

జైలు నుంచి బయటకి వచ్చాక హీరో కి కొన్ని నిజాలు తెలిసి తల్లి ని ఇబ్బంది పెట్టినందుకు బాధ పడతాడు… వినడానికి బాగానే ఉన్న అసలు స్క్రీన్ మీద మాత్రం అత్యంతం గొడవలు పిచ్చి గెంతులు తాగుడు తిరుగు కోర్ట్ కేసులు తప్ప ఇంకా ఎం ఉండదు.. 

ఇలాంటి సినిమాలకి యంత దూరంగ ఉంటే అంత మంచిది.. 

CCC Rating : 2/5

Tags

follow us

Web Stories