టిల్లు స్క్వేర్ నుంచి తప్పుకోవడంపై అనుపమ క్లారిటీ

ప్రేమమ్ , అ ఆ , శతమానం భవతి వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అనుపమ ..ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటూ వస్తుంది. ఇటీవలే ఈ భామ నిఖిల్ సరసన కార్తికేయ 2 లో నటించి పాన్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి నిఖిల్ కు జోడిగా 18 పేజెస్ మూవీ లో నటించింది. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుమారి 21 ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయగా , సుకుమార్ కథ అందించారు.
కాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అనుపమ..సినిమా విశేషాలతో పాటు టిల్లు స్క్వేర్ నుంచి తప్పుకోవడంపై స్పందించింది. ‘ఇప్పుడు 18 పేజీస్ గురించి మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్‌కు ఏం జరిగిందో నాకు తెలియదు. దీని గురించి వెబ్‌సైట్స్‌లో కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను’ అంటూ దాటవేసింది. కాగా.. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ ‘డీజే టిల్లు’లో సిద్ధుకు జంటగా నేహా శెట్టి నటించగా.. సెకండ్ పార్ట్‌లో అనుపమను ఫిమేల్ లీడ్‌గా తీసుకున్నారు. కానీ ఒక వారం షూటింగ్ తర్వాత తను ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీనికి సంబంధించి మూవీ టీమ్ నుంచి కూడా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకుతున్నారు.